యాడికి మండల కేంద్రానికి చెందిన రమేష్ సావిత్రి దంపతుల కుమారుడు శ్యాంసుందర్ (16)అనే ఇంటర్ చదువుతున్న విద్యార్థి డోన్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల హాస్టల్లో సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్యాంసుందర్ హాస్టల్ బాత్రూం గదిలో ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. తోటి హాస్టల్ విద్యార్థులు గమనించి వార్డెన్ కు సమాచారమిచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యం కారణంగానే శ్యాంసుందర్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ విద్యార్థుల సంఘాల నాయకులు హాస్టల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.