గణపతి భక్తిని చాటితే వృక్షం సమాజానికి నీడనిస్తుందని విత్తన గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదామని బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద పటేల్ అన్నారు శనివారం పట్టణంలోని ఎన్ఎస్పి కార్యాలయంలో విత్తన గణపతి విగ్రహాలను మాజీ జెడ్పి వైస్ చైర్ పర్సన్ విజయ్ కుమార్ vdf అధ్యక్షులు శ్రీనివాస్లతో కలిసి పంపిణీ చేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన పర్యావరణ పరిరక్షణ కోసం విత్తన గణపతి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని ప్రతిష్టించి పూజించాలి అన్నారు