మండపేట లో డ్రగ్స్ వద్దు బ్రో పేరిట విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో టౌన్ సీఐ సురేష్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం నినాదంతో పనిచేస్తున్నామన్నారు. విద్యార్థులకు పొక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు, పోలీస్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.