కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి విక్రయాలు కొనసాగుతున్నాయని యార్డు సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈనెల 26 అమ్మకముకాని 2,782 క్వింటాళ్ళ ఉల్లిగడ్డలను బుధవారం అనగా 27వ తేదీన టెండర్ నిర్వహించగా 1,080 క్వింటాళ్ళ ఉల్లిగడ్డలు అమ్మకము జరిగిందని తెలిపారు. అమ్మకము కాగా మిగిలిన 1,703 క్వింటాళ్ళ ఉల్లిగడ్డలలలో కొంత మొత్తమును జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతు బజారులకు సరఫరా చేయబడుతుందని తెలిపారు. ఉల్లిగడ్డల రైతు సోదరులకు ఉల్లిగడ్డల పంట ఉత్పత్తులను గ్రేడింగ్ చేసుకొని మురుగు ఉల్లిగడ్డలు లేకుండా శుభ్రము చేసుకొని మార్కెట్ యార్డుకు అమ్మ