తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా కొరతలేదు, రైతులకు అవసరం ఉన్నంత యూరియా ఇస్తామని ఎన్ని మాటలు చెప్పినా అది క్షేత్ర స్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. అందుకు నిదర్శనం వికారాబాద్ పట్టణంలో యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆధార్ కార్డు ఉంటేనే ఎరువులు యూరియా అన్న వ్యాపారులు ప్రస్తుతం ఈరోజు మాత్రం పట్టా పాస్ బుక్ ఉంటేనే యూరియా ఇస్తామని చెప్పడంతో కంగుతిన్న రైతులు. ప్రభుత్వం యూరియా సక్రమంగా అందజేయాలని కోరుతున్న రైతన్నలు.