కూకట్పల్లి నల్లచెరువు ప్రస్తుతం నిండుకుండలా మారింది. హైడ్రా ఏర్పడిన తర్వాత చెరువుల అభివృద్ధిలో భాగంగా కూకట్పల్లి నల్లచెరువును యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. 27 ఎకరాల 14 గుంటలు ఉండాల్సిన చెరువును, కబ్జా చేసి 17 ఎకరాల 32 గుంటలు ఉండడంతో వాటిని తొలగించి మరల చెరువుకు పునరుద్జీవనాన్ని ప్రసాదించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనికి సంబంధించిన వీడియో హైడ్రాధికారులు విడుదల చేశారు.