శంషాబాద్ విమానాశ్రయంలో తిరుపతికి వెళ్లే అలయన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సాంకేతిక లోపం తలెత్తడంతో రన్వే పైనే గంటసేపు విమానం నిలిచిపోయింది. దీంతో 37 మంది ప్రయాణికులు ఆందోళనకు దిగారు. మూడుసార్లు రన్వే పైకి వెళ్లి తిరిగి రావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగి అక్కడ ఉన్న సిబ్బందిని నిలదీశారు.