కడియం నుండి రాజమండ్రి వైపు వస్తున్న లారీ జాతీయ రహదారిలోని బొమ్మూరు జంక్షన్ లో ఆటోను తప్పించిపోయి బోల్తా పడింది ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు గాయాలయ్యాయి స్థానికులు గుర్తించి డ్రైవర్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సంఘటన స్థలానికి బొమ్మూరు పోలీసులు చేరుకుని వివరాల సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు ఎస్సై అంకారావు తెలిపారు.