Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 11, 2025
దుత్తలూరు మండలం, వెంకటంపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పఠాన్ సనా (17) ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాల మేరకు.. సనా దుత్తలూరు మోడల్ స్కూల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఇటీవల తల్లిదండ్రులు చదువు ఆపించారు. ఈ క్రమంలో గురువారం తల్లిదండ్రులు చికిత్స కోసం ఉదయగిరికి వెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె విగత జీవిగా పడి ఉంది.