సీఎం చంద్రబాబు మాట్లాడినట్లు ఫేక్ వీడియోలో క్రియేట్ చేసిన ఐశ్వర్య అనే మహిళపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు టిడిపి మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఐశ్వర్య అనే మహిళ వైసిపికి చెందిన కార్యకర్త అని.. ఆమెపై కేసు నమోదు చేయాలని నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు వైసిపి దిగజారుడు రాజకీయాలు చేస్తుందని గురువారం మండిపడ్డారు. సీఐ కి వినతి పత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడారు.