శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం తెంబూరు గ్రామ సచివాలయం పరిధిలోగల రైతు సేవా కేంద్రంలో నిన్న శుక్రవారం 220 బస్తాల యూరియా లారీ లోడు దిగుమతి జరిగింది.. దానికి గాను స్థానిక అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రకాష్ రాజు, సచివాలయ సర్వే రుకేంద్ర వీరిద్దరు అధికారులు ఒకటై పాతపట్నం గ్రామానికి చెందిన ఒక రైతు వద్ద కొన్ని యూరియా బస్తాలు యూరియాకు డబ్బులు తీసుకుని అర్ధరాత్రి 11 గంటల సమయంలో రైతు సేవా కేంద్రంలోని తాళాలు తీసి యూరియా బస్తాలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో తెంబూరు జనసేన నాయకుడు దొడ్ల దినేష్, కుంచా శేఖర్, తెంబూరు యువకులు పట్టుకున్నారు.