నంద్యాల జిల్లా అవుకులో పొలం పిలుస్తుంది కార్యక్రమం ను మంగళవారం మండల వ్యవసాయ అధికారి కలిమున్నిసా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వివిధ పంటలలో తెగుళ్లు, వ్యాధుల గురించి అవగాహన కల్పించారు. అలాగే నానో యూరియా, నానో డీఏపీలో వాడకం గురించి వివరించారు. ప్రతీ రైతు నానో యూరియా, నానో డీఏపీలపై ఉన్న అపోహలను తొలగించుకొని మంచి దిగుబడులు సాధించాలని సూచించారు.