వినాయక పండగ వేడుకల్లో అలజడులు సృష్టిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కుందుర్పి ఇంచార్జ్ ఎస్ఐ లోకేష్ హెచ్చరించారు. కుందుర్పి రెవెన్యూ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆయన తహశీల్దార్ ఓబులేసుతో కలిసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడారు. వినాయక పండుగ వేడుకల్లో తమను కూడా భాగస్వాములను చేసుకోవాలన్నారు. పండగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినాయకుల నిమజ్జన కార్యక్రమాన్ని సాయంత్రం లోగా పూర్తి చేయాలన్నారు.