నంద్యాల జిల్లా నందికొట్కూరులో కనురెప్పలు మూసి తెరుస్తున్న గణనాథుడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. నందికొట్కూరులోని సాయిబాబా పేటలో గణేశ్ ధార్మిక సంఘం ఏర్పాటు చేసిన భారీ వినాయకుని విగ్రహం భక్తులను మంత్రి ముగ్ధులను చేస్తోంది. సుమారు లక్ష రూపాయల వ్యయంతో హైదరాబాద్ నుంచి తెప్పించిన ఈ వినాయకుడు కనురెప్పలు మూసి తెరవడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇతర ప్రాంతాల నుండి భక్తులు భారీగా వెళ్లి దర్శించుకుని పూజలు చేస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా 5 రోజుల పాటు విస్తృతంగా పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.