Araku Valley, Alluri Sitharama Raju | Sep 10, 2025
అనంతగిరి మండలం లుంగపర్తి పంచాయతీ నేలపాలెం గ్రామం లో గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న శిరగం ఎండన్న(62). సుమారు 5 కిలోమీటర్ల మేర డోలిమోత బుధవారం సాయంత్రం ఆసుపత్రికి మోసుకొచ్చారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జన్ని భీమన్న మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి నేటికీ 79 సంవత్సరాలు దాటిన అనారోగ్యంతో బాధపడుతున్న బాగోలేని రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నా రోడ్డు సౌకర్యం లే నందున డోలీ మోతలే శరణ్యం అవుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నేలపాలెం. ఎర్రమెట్టు వంతెన గరువు బురదగుమి గ్రామలకు. రోడ్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.