అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారు కోర్ట్ మానిటరింగ్ సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధితులకు న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఉన్నతాధికారులకు నివేదించాలని ఆదేశించారు.పెండింగ్ సమన్లు, వారెంట్లు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్తగా అమలులోకి వచ్చిన BNS చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ గారు తెలిపారు. నేరస్థలాల్లో సాక్ష్యాలను సేకరించేందుకు ఆధునిక ట్యాబ్‌లు ప్రతి పోలీస్ స్టేషన్‌కు పంపిణీ చేశారు.