జనగామ జిల్లా కలెక్టరేట్లో కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ తో కలిసి ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో వినాయక నవరాత్రులు జరుపుకోవాలని మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని దానివల్ల పర్యావరణం చెరువులు కుంటలు కాలుష్యం కాకుండా ఉండేందుకు దోహదపడుతుందన్నారు విగ్రహాలను తరలించేప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.