మచిలీపట్నం లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో ZPTCల పెండింగ్లో ఉన్న గౌరవ వేతనాలకు సంబంధించి గురువారం జరిగిన సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 18 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనం రూ.74.93 లక్షలు ZP సాధారణ నిధుల నుంచి చెల్లింపునకు సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఛైర్పర్సన్ హారిక నిండు సభలో తెలియజేయగా సభ్యులు హర్షాతి రేకాలు వ్యక్తం చేశారు. గౌరవ వేతనం కోసం సభ్యులు గత కొంతకాలంగా పోరాడుతున్నారు.