*జగిత్యాల రూరల్ పొలాస* గ్రామంలోని సహస్ర లింగాల దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా ఆదివారం ఉదయం పది గంటలకు. ప్రత్యేక వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా పౌర్ణమి సందర్భంగా మహాదేవునికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం పలు పుష్పాలతో స్వామివారిని చక్కగా అలంకరించి మంగళ హారతులను సమర్పించి అలాగే నక్షత్ర హారతిని స్వామివారికి సమర్పించారు. విచ్చేసిన భక్తులు స్వామి వారికి అభిషేకాలను నిర్వహించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలు ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈనాటి కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు నలామాసు గంగాధర్ ఆలయ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.