Parvathipuram, Parvathipuram Manyam | Aug 25, 2025
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుని పూజిద్దామని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలందరూ మట్టి గణపతినే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన రంగు రంగుల గణపతి ప్రతిమలు, రసాయన రంగులతో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని గుర్తుచేశారు. మట్టితో చేసిన వినాయక విగ్రహాలు ప్రకృతికి అనుకూలమైనందున సులభంగా భూమిలో కలిసిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక తదితరులు పాల్గొన్నారు.