పల్లవోలు పంచాయతీలో పేకాట శిబిరంపై కలికిరి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి పేకాడుతున్న ఏడు మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ ఎస్ అనిల్ కుమార్ సోమవారం సాయంత్రం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు కలికిరి మండలం పల్లవోలు పంచాయతీలో పేకాడుతున్నట్లు అందిన సమాచారంతో తమ సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించి పేకాడుతున్న ఏడు మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20570 నగదు తో పాటు ఆరు ద్విచక్ర వాహనాలు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.