చింతల మానేపల్లి మండలంలోని దిందా గ్రామస్తులు హైదరాబాదులోని ప్రజా భవన్ కు పాదయాత్రగా వెళ్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని ప్రజ్ఞాపూర్ వద్ద ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పోడు రైతులను పరామర్శించారు. 400 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేయడానికి సంకల్పించిన దిందా పోడు రైతుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు,