అవాంఛనీయ ఘటనలు, ప్రమాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా గణేష్ వేడుకలు నిర్వహించు కోవాలని పెద్దవడుగూరు ఎస్సై ఆంజనేయులు తెలిపారు వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు పోలీసు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. వినాయక చవితి పండుగ మొదలు నిమజ్జనం వరకు ప్రజలు పోలీసులతో సహకరించాలన్నారు. పోలీస్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన ganeshutsav.net అనే వెబ్సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లో అనుమతులు పొందాలన్నారు.