ఆదోనిని జిల్లా చేసి, పెద్దహరివానాన్ని కొత్త రెవెన్యూ మండలంగా చేయాలని గ్రామైక్య సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఆదోని నుంచి 30కి.మీ దూరంలో ఉన్న పెద్దహరివానం పెద్ద గ్రామమైనప్పటికీ అభివృద్ధి చెందలేదని, పరిపాలన పరంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆదినారాయణ, కరెప్ప తెలిపారు. గ్రామ ప్రభుత్వ వైద్యశాల పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.