Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మహాదేవపూర్ మండలం సరస్వతి అన్నారం బ్యారేజీ గేట్లు తెరిచి ఉండడంతో, పైనుంచి వచ్చే వరదకు చండ్రుపల్లి వాగు ఉదృతి పెరగడంతో చండ్రుపల్లి వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. లో లెవెల్ వంతెన పైనుంచి వరద ప్రవాహం పెరగడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.