జిల్లా అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలెక్టర్ల కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఆయా శాఖల పరిధిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయా శాఖల పరిధిలో వచ్చిన సమస్యలకు సంబంధించిన వివరాలను తెలపాలన్నారు.