జనగామ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శనివారం కళాశాల ప్రిన్సిపాల్ సునంద అధ్యక్షతన జాతీయ సేవా పథకం ప్రోగ్రాం ఆఫీసర్ నలమాస సునీత ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థినులలు ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సునంద డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలామాలను వేసి మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు.విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించి గురువులకు నిజమైన గురుదక్షిణ సమర్పించాలని,విద్యార్థుల విజయమే గురువులకు నిజమైన గురుదక్షిణ అన్నారు.