లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కక్షిదారులకు సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్లో ఇరు వర్గాల కక్షిదారులు పరస్పర అంగీకారంతో సత్వర పరిష్కారం పొందవచ్చన్నారు. ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.