రైతులు నష్టపోకుండా క్వింటా ఉల్లిని రూ.1200లకు కొంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చెప్పారు. సోమవారం ఉదయం 12 గంటలు కర్నూలు మార్కెట్ యార్డ్ను సందర్శించి ఉల్లి రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ముందుంటారన్నారు. కర్నూలు జిల్లా ఉల్లి రైతుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కరించారన్నారు. గత ప్రభుత్వంలో ఉల్లి రైతుల సమస్యను పట్టించుకోలేదన్నారు.