ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోనీ కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్ లో శుక్రవారం ఉదయం దాడి ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం అయ్యప్ప అనే యువకుడు బార్ లో ఉన్న తన స్నేహితులు పిలవడంతో అక్కడికి వెళ్లి స్నేహితులతో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో అక్కడ మద్యం సేవిస్తున్న షేక్ అనిల్ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి అయ్యప్పను బీరు బాటిల్ తో తలపై కొట్టి ఒంటిపై పొడిచే గాయపరుస్తాడు. వెంటనే అప్రమత్తమైన స్నేహితులు అయ్యప్పను ఒంగోలు రిమ్స్ వైద్యశాలగు తరలించి చికిత్స అందిస్తారు. ఇష్యన్ తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు అనిల్ ను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు.