Araku Valley, Alluri Sitharama Raju | Aug 31, 2025
ఆంధ్రా, ఒడిశా రష్ట్రాలు సంయుక్తంగా నిర్వహణలో ఉన్న జోలాపుట్టు, డుడుమ జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీటి నిల్వలు వస్తుండడంతో నీటి నిల్వలను దిగువకు విడుదలను చేస్తున్నారు. జోలాపుట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, మంగళవారం 2,748.05 అడుగులకు చేరింది. ఈ క్రమంలో జోలాపుట్టు ప్రధాన జలాశయం నుంచి 6 వేల క్యూసెక్కులు నీటిని జలాశయం దిగువన ఉన్న బలిమెలకు విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు ప్రాజెక్టు ఏఈ సర్వేశ్వరరావు పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. గంట, గంటకు నీటి నిల్వల స్థాయిని అంచనా వేస్తున్నారు.