రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదని ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా వేంపల్లి మండలం లోని తాళ్లపల్లి గ్రామంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని చెప్పారు. రాష్ట్రంలో ఉల్లి, అరటి, చీని, మినుము రైతులు ధరలు లేక అల్లాడుతున్నారని చెప్పారు. మరోవైపు యూరియా కొరతతో రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పెద్దలే కమిషన్ల కోసం బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహిస్తున్నారన్నారు. హెరిటేజ్ లో కేజీ ఉల్లి రేటు 35 రూపాయలు ఉందన్నారు.