కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం వల్ల ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టికె విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆటో కార్మికులకు ఉచిత బస్సు పథకం వల్ల ఉపాధి లేకుండా పోయిందని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేస్తూ మంగళవారం సబ్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆటో కార్మికులకు నెలకు పదివేల రూపాయలు చొప్పున సహాయం అందించాలని డిమాండ్ చేశారు.