బందరు పొలీస్ కార్యలయంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో 39 అర్జీలను ప్రజల నుండి స్వీకరించిన జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, ఐపీఎస్. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే సదుద్దేశంతో తలపెట్టిన మీకోసం కార్యక్రమాన్ని సోమవారం మద్యాహ్నం 3 గంటల సమయం వరకు స్తానిక మచిలీపట్నం లొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు, ఐపీఎస్. నిర్వహించి, ఫిర్యాదుదారులు వద్ద నుండి మొత్తం 39 ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ అధికారులను సత్వరంగా పరిష్కరించ వలసిందిగా తగు ఆదేశాలను ఎస్పి జారీ చేసారు.