శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పాటుకు పుట్టపర్తిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ శనివారం సాయంత్రం స్థలాలను పరిశీలించారు. కప్పలబండ పొలంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవో సువర్ణ, హిందూపురం సీనియర్ సివిల్ జడ్జి శైలజ, జూనియర్ సివిల్ జడ్జి సయ్యద్ ముజీబ్ పస్పలతో కలిసి 2చోట్ల స్థలాలను పరిశీలించారు. అనువైనచోట జిల్లా కోర్టును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.