శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం కలెక్టర్ టీఎస్ చేతన్ యూరియా పంపిణీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పారదర్శకంగా యూరియా పంపిణీకి చర్యలు చేపట్టామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రస్తుతం యూరియా ఎంత స్టాక్ ఉంది, సబ్సెంట్ ఉందా, వారంలో ఎంత అవసరం ఉంది, అనే వివరాలు పంపాలని మండల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.