శ్రీ సత్య సాయి జిల్లా అమడగూరు మండలం లోకోజిపల్లిలో మంగళవారం మధ్యాహ్నం మండల వ్యవసాయ అధికారి వెంకటరమణాచారి 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో వేరుశనగ, మొక్కజొన్న మేలైన యాజమాన్య పద్ధతులు గురించి రైతులకు వివరించారు. వేరుశనగ పంటకు 45 రోజుల తర్వాత జిప్సిమ్ వేయడంతో గింజ నాణ్యత, నూనె శాతం పెరుగుతుందని, సుష్మ దాతులోకం నుంచి అరికట్టవచ్చని అన్నారు. జింక్ లోప నివారణకు జిలేటేడ్ జింక్ పిచికారి చేయాలన్నారు.