విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని శనివారం మధ్యాహ్నం ఎల్ కోట లో నిర్వహించిన సుపదా 22వ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. విద్యార్థులమైన కార్మికులమైన జీవితంలో ఎవరైనా పురోగతికి క్రమశిక్షణ ముఖ్యమని చెప్పారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో పనిచేయడానికి వ్యవస్థీకృతంగా ఉండడానికి సరైన ఎంపిక చేసుకోవడానికి క్రమశిక్షణ మనకు నేర్పుతుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు.