పోలీసులను అసభ్య పదజాలంతో దూషించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.. వేదయపాలెం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులుపై అనుచిత వ్యాఖ్యలు చేసినా పోలీసు అసోసియేషన్ స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. పోలీస్ శాఖపై తమకు గౌరవం ఉంది కాబట్టే అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు.