ప్రతీ వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే వినతులకు సంపూర్ణ న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదేశించారు. అర్జిదార్లు సంతృప్తి చెందే విధంగా వాటికి పరిష్కారం చూపించాలని సూచించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 188 వినతులు వచ్చాయి. ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 64 వినతులు అందాయి.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాల మేరకు త్వరలో PHRD కు సంబంధించి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తామని ప