ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన లారి ఇద్దరికీ గాయాలు ద్విచక్ర వాహనాన్ని లారీ డీ కొట్టడంతో ఇద్దరికీ గాయాలు అయిన ఘటన రామాయంపేటలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద హైదరాబాద్ వైపు రోడ్ క్రాస్ చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూసాయిపేట గ్రామానికి చెందిన ఎశమైన స్వామీ అనే వ్యక్తి కి తీవ్ర గాయాలు, ఆయన భార్యకు స్వల్ప గాయాలయ్యాయి, ఘటన స్థలం చేరుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.