సైదాపురం మండలంలోని ఊటుకూరులో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో వెంకట క్లిష్ట మైనింగ్ ఏర్పాటుకు సానుకూలత వ్యక్తమైంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో నెల్లూరు ఆర్డీవో అనూష తదితరులు పాల్గొన్నారు.మైనింగ్ అనుమతికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని గ్రామస్ధులు తెలిపారు. ఒకరిద్దరు మాత్రం మైనింగ్ సర్వే సెంటర్లలో తాము సాగు చేసుకుంటున్న భూములున్నాయని, న్యాయం చేయాలని ఆర్డీవో కు వినతి పత్రం అందజేశారు