మారుతున్న కాలానుగుణంగా విద్యార్థులు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని నంద్యాల దిశ పోలీస్ స్టేషన్ సీఐ గౌతమి అన్నారు. శుక్రవారం బెతంచెర్లలోని ఓ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు శక్తి యాప్, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నంబర్లు, రోడ్డు రవాణా నిబంధనలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.