కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మైదుకూరు రోడ్డులో గల బీరం కంటి వైద్యశాలలో మంగళవారం కంటి వైద్య నిపుణులు డాక్టర్ రాజేంద్ర రెడ్డి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో బద్వేల్ పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సద్వినియోగం చేసుకున్నారు. కంటి వైద్య నిపుణులు డాక్టర్ బీరం రాజేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రజలు కంటి చూపులు పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. ఏదైనా కంటి సమస్యలు సంభవించినప్పుడు వెంటనే వైద్యులను కలవాలన్నారు. ప్రతి ఒక్కరు మంచి ఆహారాన్ని తీసుకోవాలని తద్వారా కంటి చూపు బాగా కనపడుతుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.