జనగామ జిల్లా కేంద్రంలోని గిర్నీగడ్డ ఎక్ మీనార్ మక్కా మస్జీద్ చౌరస్తా లొ మోమిన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం మిలాద్ ఉన్ నబి (మొహమ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్బంగా నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధి గా హాజరు అయిన జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ జనగామ లొ అన్ని మతాల వారు ఎంతో సోదర భావంతో ఉంటారని అన్ని మతాల పండగల వేల కలిసిమెలిసి వేడుకలు నిర్వహించుకుంటారని,ఈ క్రమంలో మీలాద్ ఉన్ నబి సందర్బంగా ముస్లింలు కుల, మతాలకు అతీతంగా గత కొన్ని రోజులుగా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా గొప్ప విషయమని తెలిపారు.