జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ మైదానంలో హకీ పోటీలను ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ ప్రావీణ్య శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా క్రీడల అధికారి ఖాసీం భేగ్, SGF జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, క్రీడా సంఘాల నాయకులు పాల్గొన్నారు.