వినాయక చవితి వేడుకల సందర్భంగా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు విశాఖ నగరంలో గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు జరిగాయి. అంచనా ప్రకారం దాదాపు 6,000 పైగా విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేశారు. అయితే, విగ్రహాలతో పాటు ఇతర వ్యర్థాలను వేరు చేయడంలో మండప నిర్వాహకులు నిర్లక్ష్యం వహించడంతో తీర ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయి. జోడుగుళ్లపాలెం, ఆర్కే బీచ్, సాగర్‌నగర్ తీరాల్లో గణపతి విగ్రహాల వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయి. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం , స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించినా, క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితి విచారకరంగా ఉంది.