హైదరాబాద్ పట్టణానికి చెందిన 37 ఏళ్ల వ్యక్తి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 16వ తేదీన 7 షేవింగ్ బ్లేడ్లను మింగాడు. కుటుంబీకులు గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో జనరల్ సర్జరీ విభాగంలోని డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి సర్జరీ ద్వారా బ్లేడ్లను తొలగించారు. ఇది వైద్య చరిత్రలో అరుదైన శాస్త్ర చికిత్స అని వైద్యులు డాక్టర్ సునీల్ తెలిపారు. జీర్ణాశయంలో ఎలాంటి రక్త గాయాలు కాకుండా బ్లేడ్లను తొలగించామని తెలిపారు.