ఉపాధ్యాయులు తమ జ్ఞానాన్ని విస్తృత పరుచు కోవడంలో నిరంతర విద్యార్థిగా వ్యవహరించాలని అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందివ్వగలరని పేట విద్యాశాఖ అధికారి గోవిందరాజు అన్నారు. జిల్లా సి వి రామన్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం జిల్లా సైన్స్ ఉపాధ్యాయులు శ్రీహరి కోట అంతరిక్ష కేంద్ర సందర్శన నిమిత్తము పేట జిల్లా కేంద్రంలో డిఇఓ నాలుగున్నర గంటల సమయంలో జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ పిల్లలలో సాంకేతిక పరిజ్ఞానం పెంచడంలో వారిలో గల అనుమానాలను నివృత్తి చేయడంలో సమర్థవంతమైన బోధనలో ఉపాధ్యాయులకు ఈ పర్యటన తోడ్పడాలని ఆకాంక్షించారు.