రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో, వ్యవసాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు రైతులను అవమానపరిచేలా ఉన్నాయని వైఎస్ఆర్ సిపి జిల్లా పరిశీలకులు సురేష్ బాబు విమర్శించారు.ఆయన మాట్లాడుతూ రైతు క్యూలో నిలబడితే బఫే ఏర్పాటు చేయాలా అనడం దారుణం. రైతు కోసం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు, ధరల స్థిరీకరణ నిధి వంటి పథకాలు గతంలో రైతులకు అండగా నిలిచాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు అన్నారు.